మన సమాజం యొక్క విచిత్ర స్థితి - The strange state of our society

The Hindu Portal
0
మన సమాజం యొక్క విచిత్ర స్థితి - The strange state of our society
: మన సమాజం యొక్క విచిత్ర స్థితి :

   మన సమాజం యొక్క స్థితి ఈనాడు ఎంత విచిత్రంగా ఉన్నదంటే-మన సమాజానికి ఎటువంటి జీవనశక్తి అవసరమో అది బొత్తిగా లేకుండా పోయింది. మహమ్మదీయులు, ఆంగ్లేయులు మనలో కులవిభేదాలను పెంచారు. అంటరానితనము, ఆహారనియమాలను పాటించటం ద్వారా హెచ్చుతగ్గు భేదభావాలు మొదలుగా సమస్యలను తెచ్చి పెట్టారు. వాటికి తప్పంతా వారిదేనంటూ మనం వారిని దూషించటంవల్ల ఏమీ జరగదు. వీటికి హిందూ సమాజమే బాధ్యత వహించవలసి ఉంటుంది. మనలో ఉన్న దోషాలను, బలహీనతలనూ వారు బాగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడైనా మనం సరియైనరీతిలో ఆలోచించాలి గదా!
 పాకీపని చేస్తున్నవారు ఒకతరం తర్వాత మరోతరంగా సమాజంలోని ప్రజల మలాన్ని గంపలలో నింపుకొని మోస్తూపోవాలనటం కుదురుతుందా? మలాన్ని ఎత్తిదూరంగా తీసికొనిపోయేపని చేయవలసి ఉందంటే, పదితరాలు గడిచి తర్వాతకూడా నా కుటుంబంలో వారే ఈపని చేస్తూ ఉండాలా? ఇది ఎంత అన్యాయం? అని ఒక సఫాయీ కార్మికుడు గనుక ఆలోచిస్తే, దానికి మనం ఇవ్వగల జవాబు ఏమిటి? ప్రపంచంలో ఎన్నివిధాలుగా మార్పులు వస్తున్నవో తెలుసుకొని వాటిపట్ల సవ్యమైనరీతితో స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top